News October 7, 2025
ఈ నెలాఖరున బీసీ సభ: టీపీసీసీ చీఫ్

TG: ఈ నెలాఖరులో కామారెడ్డిలో BC సభ నిర్వహించనున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోగా నామినేటేడ్, పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో BC అభ్యర్థినే బరిలోకి దించుతామని స్పష్టం చేశారు. CM రేవంత్, మీనాక్షి నటరాజన్‌తో మరోసారి చర్చించి ఆశావహుల పేర్లను AICCకి పంపుతామన్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో పార్టీ అధిష్ఠానం అభ్యర్థి పేరును ప్రకటిస్తుందన్నారు.
Similar News
News October 7, 2025
అలా చేస్తేనే రోహిత్, కోహ్లీ టీమ్‌లో ఉంటారు: ABD

2027 ODI WC టీమ్‌లో చోటు దక్కాలంటే రోహిత్, కోహ్లీ పరుగులు చేయాల్సిందేనని SA మాజీ క్రికెటర్ డివిలియర్స్ అన్నారు. ‘WC వరకు రోహిత్, కోహ్లీ జట్టులో ఉంటారన్న గ్యారంటీ లేదు. అందుకే గిల్‌ను కెప్టెన్ చేశారు. ఇది సరైన నిర్ణయమే. వారిద్దరి నుంచి అతడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. టీమ్ ఇండియాలో కాంపిటిషన్ ఎక్కువ కాబట్టి రోహిత్, కోహ్లీ రన్స్ చేయక తప్పదు. వారు రాణిస్తారనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.
News October 7, 2025
ఆంజనేయుడికి అప్పాల మాల ఎందుకు?

సూర్యుడిని పండుగా భావించి బాల హనుమ ఆకాశానికి ఎగిరాడు. అప్పుడే రాహువు కూడా రవిని పట్టుకోబోతున్నాడు. ఈ క్రమంలో హనుమంతుడే మొదట భానుడి వద్దకు చేరుకున్నాడు. అప్పుడు అంజని పుత్రుడి శౌర్యాన్ని మెచ్చిన రాహువు తన భక్తులకు ఓ వరమిచ్చాడు. తనకిష్టమైన మినపపప్పుతో చేసిన ప్రసాదాన్ని ఆంజనేయుడి మెడలో మాలగా సమర్పిస్తే.. వారికి రాహు దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలా ఈ గారెల మాల సమర్పణ ఆనవాయితీగా మారింది.
News October 7, 2025
శింబు-వెట్రిమారన్ సినిమాలో సమంత?

తమిళ హీరో శింబు, వెట్రిమారన్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆమెను మూవీ టీమ్ సంప్రదించిందని, చర్చలు జరుగుతున్నట్లు తెలిపాయి. ఈ ప్రాజెక్టును ‘వడ చెన్నై’ వరల్డ్‌లో భాగంగా రూపొందించనున్నట్లు డైరెక్టర్ ఇటీవల వెల్లడించారు. ధనుష్ హీరోగా నటించిన ‘వడ చెన్నై'(2018) సూపర్ హిట్‌గా నిలవగా, దాని యూనివర్స్‌లో మరిన్ని చిత్రాలు రానున్నాయి.