News January 22, 2026

BCCIపై పిల్‌… డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

image

BCCIని భారత క్రికెట్ టీమ్ ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేయడాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన PILను SC డిస్మిస్ చేసింది. ‘BCCI కాకుంటే ఇంకేది ఉంటుంది? 2, 3 టీములుంటే వాటి మధ్య పోటీ ఉండేది. ఇప్పుడలా లేదు కనుక ఇష్యూయే లేదు’ అని CJI జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ గుర్తింపు ఉందని, దాన్ని ఎలా ప్రశ్నిస్తామని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. జాతీయ క్రీడా చట్టం నియంత్రణ కూడా ఉంటుందన్నారు.

Similar News

News February 14, 2026

ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

image

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం(ఫొటోలో)
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం

News February 14, 2026

విజయ్ ర్యాలీలో కార్యకర్త మృతి.. అన్నాడీఎంకే సెటైర్

image

టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. సేలంలో సభ జరుగుతున్న సమయంలో గుండెపోటుతో ఓ కార్యకర్త కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై అన్నాడీఎంకే నేత సత్యన్ వ్యంగ్యంగా స్పందించారు. టీవీకే ర్యాలీకి వెళ్తే శవపేటిక పట్టుకెళ్లాలని ట్వీట్ చేశారు. అంతకుముందు కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.