News September 5, 2024

సెప్టెంబర్ 29న BCCI ఏజీఎం.. NCA ప్రారంభోత్సవం

image

బెంగళూరులో సెప్టెంబర్ 29న బీసీసీఐ 93వ ఏజీఎం జరగనుంది. ఇప్పటికే 18 అంశాలతో కూడిన అజెండాను రాష్ట్ర సంఘాలకు పంపించారు. ఐసీసీకి వెళ్తున్న జైషా స్థానంలో మరొకర్ని ఈ సమావేశంలో ఎన్నుకొనే అవకాశం లేదని తెలిసింది. డిసెంబర్ 1న ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఏజీఎం రోజే జరిగే కొత్త NCA ప్రారంభోత్సవంలో బోర్డు సభ్యులు పాల్గొంటారు. కొత్త కార్యదర్శి ఎంపికకు SGM నిర్వహిస్తారని సమాచారం.

Similar News

News December 1, 2025

నేడు గీతా జయంతి

image

పురాణేతిహాసాలెన్ని ఉన్నా.. అవేవీ చదవకపోయినా ఒక్క భగవద్గీత చదివితే చాలంటారు. అంతటి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర గ్రంథం ఆవిర్భవించింది ఈరోజే. అందుకే నేడు గీతా జయంతి జరుపుకొంటాం. ‘ఫలాన్ని ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తించు’ అనే సిద్ధాంతాన్ని గీత బోధిస్తుంది. మనల్ని కర్తవ్యం వైపు నడిపిస్తుంది. జీవితంలో గీతా సారాన్ని ఆచరిస్తే పరాజయం ఉండదనడానికి మహాభారతమే నిదర్శనం. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 1, 2025

వర్క్ స్ట్రెస్‌తో సంతానలేమి

image

పనిఒత్తిడి సంతానోత్పత్తిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. తీవ్రఒత్తిడికి గురైనప్పుడు శరీరం స్ట్రెస్ హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇవి స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమైన ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తిని, సమతుల్యతను దెబ్బతీస్తాయి. స్త్రీలలో అండాల విడుదల (ఓవ్యులేషన్) ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు.

News December 1, 2025

పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

image

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్‌ విధించనున్నట్లు సమాచారం.