News March 27, 2025
శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
Similar News
News December 5, 2025
HNK కలెక్టరేట్లో ఆవిష్కరణకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం

రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. ఈ విగ్రహాలను డిసెంబర్ 9న లాంఛనంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హన్మకొండ కలెక్టరేట్లో స్థాపించిన విగ్రహాన్ని కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణ తల్లి దినోత్సవాన్ని పాటిస్తూ, సోనియా గాంధీ పుట్టినరోజున ఈ ఆవిష్కరణ జరగనుంది.
News December 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 5, 2025
పుతిన్‌కు భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేసిన మోదీ

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ భగవద్గీత ప్రతిని ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా గీత బోధనలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం భారత్‌కు చేరుకున్న పుతిన్‌కు మోదీ ఘనస్వాగతం పలికారు. ఆపై ఢిల్లీ లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న PM అధికారిక నివాసంలో ఇద్దరు నేతలు డిన్నర్లో పాల్గొన్నారు.


