News August 11, 2025
వైభవ్ సూర్యవంశీపై BCCI ఫోకస్?

సీనియర్లు ఒక్కొక్కరుగా రిటైర్ అవుతుండటంతో పద్నాలుగేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై BCCI ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అతడిని అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి NCA స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. T20, వన్డేలకు వైభవ్ అటాకింగ్ స్టైల్ చక్కగా సరిపోతుందని భావిస్తోందట. దీర్ఘ దృష్టితో అతడిని ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 12, 2025
TODAY HEADLINES

* భారత్ ఎవరికీ తలవంచదు: సీఎం చంద్రబాబు
* AP DSC ఫలితాలు విడుదల
* తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
* షూటింగ్‌లు బంద్ చేయడం సరికాదు: కోమటిరెడ్డి
* కాంగ్రెస్ చేతకానితనంతో ఎకానమీ పతనమవుతోంది: KTR
* పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ కుట్రలు: అవినాశ్
* హీరో రానాను విచారించిన ఈడీ
* తగ్గిన బంగారం ధరలు
* ‘మాస్ జాతర’ టీజర్ విడుదల
News August 12, 2025
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థ: US

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA), దాని సహచర సంస్థ మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. కొన్ని దాడుల తర్వాత 2019లో BLAను స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించారు. 2019నుంచి మజీద్ బ్రిగేడ్ ద్వారా జరిగిన దాడులకు BLA బాధ్యత వహించినట్లు పేర్కొంది. ఇటీవలదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కానీ, ఇది పాకిస్థాన్ కోసం చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.
News August 12, 2025
భారత్ ఎవరికీ తలవంచదు: చంద్రబాబు

AP: పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శక్తిమంతంగా ఎదుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ ఎవరికీ తల వంచదని, దేశం జోలికి ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. విజయవాడలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘టారిఫ్స్ విధిస్తే భారత్ ఆగిపోతుందనుకోవడం భ్రమే. మనకు ఉద్యోగాలు ఇవ్వని దేశాల్లోనే అభివృద్ధి నిలిచిపోతుంది. ఇప్పుడు ఉన్నది పవర్ ఫుల్ ఇండియా’ అని ఆయన వ్యాఖ్యానించారు.