News January 11, 2025
హార్దిక్ పాండ్యకు BCCI ఝలక్

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు బీసీసీఐ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైస్ కెప్టెన్సీని అతడికి కాకుండా మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కట్టబెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ <<15128809>>సిరీస్‌కు <<>>స్టార్ పేసర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది.
Similar News
News November 6, 2025
యుగయుగాలకు ఆదర్శం ‘శ్రీరాముడి పాలన’

సత్య యుగంలో అంతా మంచే ఉన్నా, త్రేతా యుగంలోని రామ రాజ్యమే చరిత్రలో నిలిచింది. దీనికి కారణం శ్రీరాముని గొప్ప గుణాలు, ఆదర్శవంతమైన పాలన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చూపిన రాజధర్మం సుపరిపాలనకు చిరునామాగా నిలిచింది. ఒక గొప్ప వ్యక్తి రాజుగా ఉంటే, రాజ్యం ఎంతటి ఉన్నత శిఖరాలను చేరుతుందో రామరాజ్యం రుజువు చేసింది. అందుకే, యుగాల తరబడి ఆ పాలనను ఆదర్శంగా చెప్పుకుంటారు. ‘రామరాజ్యం’ అని పోల్చుతుంటారు.
News November 6, 2025
ఈ పంటలకు నారు పెంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి

తీగజాతి కూరగాయలు అయినటువంటి చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు, బెండ, గోరు చిక్కుడు, మునగ లాంటి కూరగాయ పంటలలో విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి వీటిని నారుగా కాకుండా విత్తనాలను నేరుగా పొలంలోనే విత్తుకోవచ్చు. టమాట, వంగ, క్యాబేజి, కాలిఫ్లవర్, మిరప, ఉల్లి లాంటి పంటలలో విత్తన పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే వీటిని ముందుగా నారుమడులలో పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నారును నాటుకోవాల్సి ఉంటుంది.
News November 6, 2025
143 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు తేదీ

NITCON లిమిటెడ్‌లో 143 డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, MTS పోస్టులకు షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nitcon.org/


