News June 21, 2024
అఫ్గాన్‌కు బీసీసీఐ మరోసారి ఆపన్నహస్తం

మరోసారి అఫ్గానిస్థాన్‌కు బీసీసీఐ అండగా నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌ను ఆ జట్టు భారత్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అన్ని మ్యాచ్‌లూ నోయిడా స్టేడియం కాంప్లెక్స్‌లో జరగనున్నాయి. జులై 25 నుంచి ఆగస్టు 6 వరకు ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా 2017లో ఐర్లాండ్-అఫ్గాన్ సిరీస్ కూడా ఇదే వేదికలో జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News November 5, 2025
‘మీర్జాగూడ’ ప్రమాదం.. బస్సును 60 మీటర్లు ఈడ్చుకెళ్లిన టిప్పర్

TG: రంగారెడ్డి(D) మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్.. బస్సును ఢీకొట్టిన తర్వాత 50-60M ఈడ్చుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బ్రేక్ వేయకపోవడం లేదా పడకపోవడం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 24 మంది చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
News November 5, 2025
ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్‌లో విజయం

న్యూయార్క్ (అమెరికా) మేయర్‌గా <<18202940>>మమ్దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.
News November 5, 2025
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

<


