News July 11, 2024
పాకిస్థాన్‌కి వెళ్లేది లేదన్న BCCI?

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు BCCI నిరాకరించినట్లు ANI పేర్కొంది. ఈ టోర్నీని తటస్థ వేదికల్లో నిర్వహించాలని ICCని కోరనుందట. దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహిస్తే తాము టోర్నీలో పాల్గొంటామని చెప్పనున్నట్లు పేర్కొంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీని నిర్వహించేందుకు పాక్ ఏర్పాట్లు చేసుకుంటోంది. తమ దేశానికి భారత్ వస్తుందని పాక్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
Similar News
News November 20, 2025
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా?

AP: నిధులు జమకాని రైతులు annadathasukhibhava.ap.gov.in వెబ్సైట్లో Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. ఆధార్ నంబర్, పక్కన క్యాప్చా ఎంటర్ చేయాలి. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అందిన మొత్తం, తేదీ, ట్రాన్సాక్షన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సక్సెస్ అంటే డబ్బు జమైందని అర్థం. Pending/Rejected అంటే ఇంకా జమ కాలేదు, నిరాకరించబడిందని అర్థం. మీకు ఏమైనా సందేహాలుంటే గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి.
News November 20, 2025
405Kmph.. రికార్డులు బద్దలు కొట్టిన మెలిస్సా

కరీబియన్ దీవులను ధ్వంసం చేసిన <<18174610>>మెలిస్సా<<>> హరికేన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 252mph(405Kmph) వేగంతో విరుచుకుపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది అత్యంత శక్తిమంతమైన హరికేన్ వేగమని NSF NCAR వెల్లడించింది. జమైకా వైపు దూసుకెళ్తున్న సమయంలో ఈ రికార్డు నమోదైంది. 2010లో తైవాన్ సమీపంలో టైఫూన్ మెగీ నమోదు చేసిన 248mph రికార్డును మెలిస్సా అధిగమించింది. దీని ప్రభావంతో 70 మందికిపైగా మృతి చెందారు.
News November 20, 2025
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్.. ఇవాళే లాస్ట్ డేట్

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. నేటితో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. వెబ్సైట్ <


