News July 11, 2024
గంభీర్ డిమాండ్‌ను తోసిపుచ్చిన బీసీసీఐ?

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డిమాండ్‌ను బీసీసీఐ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ను తీసుకోవాలని గౌతీ కోరారు. కానీ ఈ ప్రతిపాదనకు బోర్డు పెద్దలు నో చెప్పినట్లు సమాచారం. స్వదేశీ స్టాఫ్‌ను నియమించుకునే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 17, 2026
రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్.. నేడే శంకుస్థాపన

AP: రాష్ట్రంలో రూ.13,000 కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకి నేడు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 2,600 మందికి ఉపాధి దక్కనుంది. దీనిని AM గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తుండగా ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది.
News January 17, 2026
WCలో బంగ్లాదేశ్.. నేడు క్లారిటీ

T20 WCలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు <<18871702>>ఐసీసీ<<>> రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముంబై, కోల్‌కతాలో తమ మ్యాచ్‌లు నిర్వహించవద్దని BCB కోరుతోంది. ఈ నేపథ్యంలో ICCకి చెందిన ఇద్దరు అధికారులు నేడు ఢాకాలో పర్యటించి BCB ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. దీంతో ఈ విషయంలో నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
News January 17, 2026
నేడు ముక్కనుమే అయినా నాన్-వెజ్ ఎందుకు తినకూడదు?

ముక్కనుమ నాడు మాంసాహారం తినొచ్చు. కానీ, నేడు మాస శివరాత్రి, శనివారం వచ్చాయి. శివరాత్రి శివునికి ప్రీతికరమైనది. అందుకే సాత్వికాహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే శనివారం శనిదేవుని, శ్రీనివాసుడి, హనుమాన్ ఆరాధనకు ఉద్దేశించిన రోజు. నియమ నిష్టలు పాటించాలి. ఇలాంటి పవిత్ర తిథి, వారాలు కలిసినప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత, దైవ అనుగ్రహం లభిస్తాయి. అందుకే నేడు శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.


