News June 16, 2024
గంభీర్ డిమాండ్కు ఓకే చెప్పిన BCCI?

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైంది. అయితే కోచ్గా ఉండటానికి BCCI ముందు గంభీర్ ఓ డిమాండ్ ఉంచినట్లు వార్తలొస్తున్నాయి. సపోర్టింగ్ స్టాఫ్ నియామకంలో పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరారట. ఇందుకు BCCI ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లు విక్రమ్, పరాస్, దిలీప్ తప్పుకోవాల్సి రావొచ్చు. అలాగే జట్టులోనూ గంభీర్ మార్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది.
Similar News
News November 23, 2025
మెదక్: రిజర్వేషన్ కోసం ఎదురు చూపులు?

మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 492 పంచాయతీలుండగా 4,220 వార్డులు, మొత్తం ఓటర్లు 5,23,327 ఉన్నారు. ఇందులో మహిళలు 2,71,787, పురుషులు 2,51,532 ఇతరులు 8 మంది ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కసరత్తు నడుస్తోంది. తమకు అనుకూలంగా వస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>


