News January 11, 2025
బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి వీరే

బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ ఎంపిక కానున్నారు. ఆ పదవులకు పోటీలో ఉన్నది వీరిద్దరే కావడంతో వారి ఎన్నిక లాంఛనం కానుంది. బీసీసీఐ ఎన్నికల అధికారి అచల్ కుమార్ జోటి ఈ విషయాన్ని వెల్లడించారు. రేపు ముంబైలో జరిగే స్పెషల్ జనరల్ మీటింగ్‌లో వీరి పేర్లను బోర్డు ప్రకటించనుంది. ఇప్పటి వరకూ బీసీసీఐ కార్యదర్శిగా చేసిన జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే.
Similar News
News September 18, 2025
అర్ధరాత్రి 5 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్

TG: భారీ వర్షం హైదరాబాద్ మహా నగరాన్ని అతలాకుతలం చేసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపునీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. అర్ధరాత్రైనా చాలామంది ఇళ్లకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. బేగంపేట-సికింద్రాబాద్ రూట్‌లో 5 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు హైడ్రా, ట్రాఫిక్, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
News September 18, 2025
సెప్టెంబర్ 18: చరిత్రలో ఈ రోజు

✒ 1883: ఫ్రీడమ్ ఫైటర్ మదన్ లాల్ ధింగ్రా(ఫొటోలో) జననం
✒ 1899: ఫ్రీడమ్ ఫైటర్, కవి గరికపాటి మల్లావధాని జననం
✒ 1950: నటి షబానా అజ్మీ జననం
✒ 1968: దక్షిణాది నటుడు ఉపేంద్ర జననం
✒ 1985: డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ జననం
✒ 1988: క్రికెటర్ మోహిత్ శర్మ జననం
✒ 1989: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప జననం
✒ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
✒ ప్రపంచ వెదురు దినోత్సవం
News September 18, 2025
UAEపై పాకిస్థాన్ విజయం

ఆసియా కప్: పాక్ జట్టు UAEపై 41 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 146/9 పరుగులు చేసింది. ఫకర్ జమాన్(50), షాహీన్ అఫ్రీది(29*), సల్మాన్ అఘా(20) రాణించారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రన్ జిత్ 3, ధ్రువ్ 1 వికెట్ తీశారు. UAE 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాహుల్ చోప్రా(35), ధ్రువ్(20) పర్వాలేదనిపించారు. PAK బౌలర్లలో షాహీన్ అఫ్రీది, అబ్రార్, రౌఫ్‌లు తలో 2 వికెట్లతో రాణించారు.