News July 18, 2024
హార్దిక్ పాండ్యకు షాకిచ్చిన BCCI!

హార్దిక్ పాండ్యకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారీ షాక్ ఇచ్చింది. టీ20 WC-2024 వరకు వైస్-కెప్టెన్‌గా ఉన్న పాండ్య.. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత కచ్చితంగా కెప్టెన్ అవుతారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా బీసీసీఐ సూర్యకు పగ్గాలు అప్పగించింది. హార్దిక్ పాండ్యను కనీసం వైస్-కెప్టెన్‌గా కూడా కొనసాగించలేదు. వన్డేలు, టీ20లకు గిల్‌ను వైస్-కెప్టెన్‌గా ప్రకటించింది.
Similar News
News January 14, 2026
ఎన్డీఏతో కలిసే ప్రసక్తే లేదు: TVK

రాజకీయంగా తమను ఇబ్బందులు పెట్టినా NDAతో కలిసే ప్రసక్తే లేదని విజయ్ దళపతి TVK స్పష్టం చేసింది. తమ సిద్ధాంత వైఖరిలో మార్పు ఉండదని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ చెప్పారు. జన నాయగన్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందనను స్వాగతిస్తున్నామని, ఇది స్నేహపూర్వక మద్దతుగానే భావిస్తున్నట్లు చెప్పారు. కాగా జన నాయగన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా BJPనే అడ్డుకుంటోందని TVK ఆరోపిస్తోంది.
News January 14, 2026
మకరజ్యోతి వేళ.. శబరిమలలో మరో స్కామ్!

కేరళ శబరిమల ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో మరో స్కామ్ బయటపడింది. అయ్యప్ప అభిషేకం కోసం భక్తులు ఆలయం వద్ద కొనే నెయ్యి ప్యాకెట్ల డబ్బు రూ.35 లక్షలు బోర్డుకు చేరలేదు. ఇది గుర్తించిన ప్రభుత్వం కేసును ACBకి అప్పగించింది. ఇప్పటికే 5Kgs బంగారు తాపడాల మిస్సింగ్ స్కామ్ రాజకీయంగానూ దుమారం రేపుతుండగా ఈ ఉదంతంతో ప్రభుత్వం మరింత కార్నర్ కానుంది. అటు ఈ సాయంత్రం పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది.
News January 14, 2026
బంగ్లా ఎన్నికలపై మైనార్టీల్లో భయాందోళనలు

బంగ్లాదేశ్‌లో FEB 12న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల్లో పాల్గొనడంపై మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్యతా మండలి ప్రతినిధులు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్‌ను కలిశాయి. భద్రతపై ప్రజల ఆందోళనను తెలియజేశాయి. ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరాయి.


