News July 4, 2024
కోహ్లీ, రోహిత్కు BCCI స్పెషల్ ట్రీట్!

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి BCCI స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. టీమ్ఇండియా ప్లేయర్లు ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణించే విస్తారా విమానానికి వారి జెర్సీ నంబర్లు (కోహ్లీ 18, రోహిత్ 45) ఉండేలా ‘UK1845’ నంబర్ కేటాయించింది. ఇలా ఈ విమానాన్ని వారిద్దరికి అంకితం చేసింది. కాగా ముంబైకి చేరుకున్న తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఓపెన్ బస్ పరేడ్లో పాల్గొననున్నారు.
Similar News
News November 23, 2025
RBIలో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

<
News November 23, 2025
వన్డేలకు కొత్త కెప్టెన్ను ప్రకటించిన టీమ్ ఇండియా

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టుకు కొత్త కెప్టెన్ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.
News November 23, 2025
ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.


