News January 11, 2025
నేడు బీజీటీపై బీసీసీఐ సమీక్ష

బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ ఘోర ప్రదర్శనపై బీసీసీఐ ఈరోజు సమీక్షించనుంది. బోర్డు పెద్దలు పాల్గొనే ఈ సమావేశంలో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ తమ వివరణను ఇవ్వనున్నారు. భవిష్య టెస్టు జట్టు కూర్పుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. పదేళ్లలో ఈ సిరీస్ ఓటమి ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Similar News
News February 2, 2026
మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచే అలవాట్లు

సిగరెట్లు, మద్యం తాగే మహిళలకు పురుషుల కంటే క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. పొగాకులోని హానికారకాలకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వంటి కొన్ని ఎంజైమ్‌లు, హార్మోన్లు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని ఇది క్యాన్సర్ కారకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, ఎంఫిసెమా, ఇతర తీవ్రమైన అనారోగ్యాల ముప్పును కూడా పెంచుతుంది.
News February 2, 2026
తిరుమలలో సర్వ దర్శనానికి 8 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. SSD టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 74,192 మంది స్వామిని దర్శించుకోగా 22,313 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.57 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.
News February 2, 2026
పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.


