News April 15, 2024

BCCI కీలక నిర్ణయం?

image

IPL మ్యాచ్‌లు జోరుగా సాగుతుండగా BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ల సమయంలో కామెంటేటర్లు వీడియోలు లేదా ఫొటోలను షేర్ చేయకుండా ఆంక్షలు విధించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఫాలోవర్లను పెంచుకోవడానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫొటోలను పోస్ట్ చేస్తున్నారని BCCI అభిప్రాయపడినట్లు సమాచారం. ఇకపై ప్లేయర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, కామెంటేటర్ల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 2, 2026

సిరిసిల్ల: ఘనంగా జాతీయ 108 ఈఎంటీ దినోత్సవం

image

జాతీయ ఈఎంటీ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీయంఈ డాక్టర్ బీ.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్, ఆర్ఎంఓ డాక్టర్ సుమన్, 108 జిల్లా మేనేజర్ సావనపల్లి అరుణ్ కుమార్, 108 సిబ్బంది అనీల్ తదితరులు ఉన్నారు.

News April 2, 2026

హై కొలెస్ట్రాల్‌కు లక్షణాలు ఉంటాయా?

image

హై కొలెస్ట్రాల్ బయటకు కనిపించని ప్రమాదం. ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు. కానీ మన శరీరంలో కొన్ని మార్పులు గమనించొచ్చు. కళ్ల దగ్గర పసుపు రంగు మచ్చలు, కొన్ని భాగాల్లో చర్మం కింద కొవ్వు గడ్డలు, కంటి పాప చుట్టూ తెల్లటి రింగ్ కనిపిస్తే అలర్ట్ అవ్వాలి. ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమే. బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.

News April 2, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లకు నేడే లాస్ట్

image

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఒకటో తరగతితో పాటు బాల వాటికల్లో ప్రవేశాలకు https://kvsangathan.nic.in/లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు.