News August 17, 2025
BCCI కొత్త రూల్.. ICC అనుసరించాలా?

BCCI కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఏ ప్లేయరైనా గాయపడి, ఆడలేని స్థితిలో ఉంటే వారి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకోవచ్చు. ఈ రూల్ మల్టీ డే(వన్డే, టీ20లు కాకుండా) ఫార్మాట్ మ్యాచ్‌లకే వర్తిస్తుంది. ఇటీవల ENGతో టెస్ట్ సిరీస్‌లో పంత్, వోక్స్ తీవ్ర గాయంతో ఆడటానికి ఇబ్బందిపడిన నేపథ్యంలో ICC కూడా దీన్ని అమలు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?
Similar News
News August 17, 2025
తమిళ దర్శకులను ఇతర భాషల డైరెక్టర్లతో పోల్చొద్దు: మురుగదాస్

తమిళ సినిమాలు ఎందుకు రూ.1000 కోట్లు కలెక్ట్ చేయట్లేదన్న ప్రశ్నకు డైరెక్టర్ మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద సమాధానమిచ్చారు. ‘తమిళ దర్శకులను ఇతర భాషల డైరెక్టర్లతో పోల్చొద్దు. ఇతర భాషల డైరెక్టర్లు జనాల్ని ఎంటర్‌టైన్ మాత్రమే చేస్తారు. కానీ తమిళ దర్శకులు వారిని ఎడ్యుకేట్ చేస్తారు. జీవితంలో ఏం చేయాలి, ఏం చేయొద్దనేది సినిమాల ద్వారా చెబుతారు. అదే ఇండస్ట్రీల మధ్య వ్యత్యాసం’ అని పేర్కొన్నారు.
News August 17, 2025
ఇండియాకు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌తో కలిసి తమ దేశంలో అశాంతికి కుట్ర చేస్తే దాడులు చేస్తామని బెదిరించారు. అఫ్గాన్ ప్రభుత్వం Tehrik-i-Taliban Pakistan (TTP) మిలిటెంట్లను పాక్‌లోకి పంపిస్తూ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తాము ఇంత కాలంగా అఫ్గాన్‌పై దయ చూపామని, కానీ ఇండియాతో కలిసి తమపైనే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
News August 17, 2025
అక్టోబర్ 2 నాటికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు: మంత్రి పొంగులేటి

TG: లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్ 2 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. “ఇప్పటికే తొలి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తయింది. ఈ నెల 18న రెండో విడత శిక్షణ మొదలవుతుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ‘భూభారతి’ తీసుకొచ్చాం. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి కావడంతో లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను నియమిస్తున్నాం” అని పేర్కొన్నారు.