News April 23, 2025
BCF వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడిగా మేదరి ఆంజనేయులు

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ వాసి మేదరి ఆంజనేయులుని BCF వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో BCF రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్, SCF రాష్ట్ర కార్యదర్శి బహుజన రమేశ్, మహాజన రైతు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంధ్యపాగ వెంకటేశ్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పల్లెమోని మన్యం, శివకుమార్ పాల్గొన్నారు.
Similar News
News April 23, 2025
BREAKING.. మరికల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మరికల్ మండల కేంద్రంలోని పసుపుల స్టేజీ దగ్గర బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. మరికల్ మండల కేంద్రానికి చెందిన శివ మెకానిక్ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మజీద్ తెలిపారు.
News April 23, 2025
అల్లూరి: ‘ఆ ఐదు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు’

అల్లూరి జిల్లాలో పదోతరగతి ఫలితాలు నిరాశ పరిచాయి. ఆశ్రమ పాఠశాలలు జెర్రిల, ధారకొండ, అప్పర్ సీలేరు, KGBV డుంబ్రిగూడ, ప్రాజెక్టు హై స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని DEO బ్రహ్మాజీ రావు తెలిపారు. రాజవొమ్మంగి ఏపీ గురుకుల పాఠశాల, లాగరాయి జడ్పీ ఉన్నత పాఠశాల, అరకువ్యాలీ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని వెల్లడించారు.
News April 23, 2025
IPL: రూ.కోట్లు ఇస్తున్నా కుర్చీకే పరిమితం!

IPL మెగా వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి కొందరిని సొంతం చేసుకున్నాయి. కానీ తీరా టోర్నీలో మాత్రం వారిని బెంచ్‌కే పరిమితం చేస్తున్నాయి. వీరిలో నటరాజన్ (రూ.10.75 కోట్లు), జాకబ్ బేతేల్ (రూ.2.6cr), గెరాల్డ్ కొయెట్జీ (రూ.2.4cr), డెవాల్డ్ బ్రెవిస్ (రూ.2.2cr), లామ్రోర్ (రూ.1.7cr), తుషారా (రూ.1.6cr), మపాకా (రూ.1.5cr), పావెల్ (రూ.1.5cr), హర్దీ (రూ.1.25cr) ఎంగిడి రూ.కోటి) తదితరులు ఉన్నారు.