News March 16, 2024
జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యం: సజ్జల

AP: చంద్రబాబు పార్టీ వెంటిలేటర్పై ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని గుర్తు చేశారు. చంద్రబాబు మాటలే తప్ప బీసీలకు ఏనాడు న్యాయం చేయలేదని విమర్శించారు.
Similar News
News April 5, 2025
నేటి నుంచి ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు

AP: ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్టలో నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, రేపు ఉదయం ధ్వజారోహణం ఉండనుంది. ఈ నెల 11న రాత్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులు హాజరవనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
News April 5, 2025
వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు: రవిశంకర్ ప్రసాద్

వక్ఫ్ సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డుల్లో పారదర్శకత పెరుగుతుందని, ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘బిల్లు పాసైనంత మాత్రాన మేం ఏ మసీదును, శ్మశానవాటికను తాకబోం. బోర్డుకు సంబంధించిన అంశాలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి. ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉందో చూడవచ్చు. నిజానికి వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు. అది చట్టం ద్వారా ఏర్పడింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News April 5, 2025
ప్రేమ పేరుతో మోసం.. 4 పెళ్లిళ్లు చేసుకున్న యువతి

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి నలుగురిని మోసగించింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మండ్య జిల్లాలో వైష్ణవి, శశికాంత్ 8 నెలలగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రా బంగారం కాజేసింది. మార్చి 24న పెళ్లి జరగ్గా, మరుసటి రోజే వాటితో పరారైంది. శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలోనూ ఆ యువతి ఇలాగే 3పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురిని మోసగించిందని తెలిసింది.