News January 24, 2025

BDR: భౌగోళిక ప్రదేశం అనుకూలంగా ఉంది: AAI

image

కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు సర్వేకు వచ్చిన AAI బృందంతో ఎంపీ రఘురామరెడ్డి, కలెక్టర్ జితేష్‌ వి పాటిల్, ఎమ్మెల్యే సాంబశివరావు కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల గురించి వారికి వివరించారు. సింగరేణి, కేటీపీఎస్, స్పాంజ్ ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, భద్రాద్రి పుణ్యక్షేత్రం ఉందని చెప్పారు. రామవరం భౌగోళిక ప్రదేశం అనుకూలంగా ఉందని AAI బృందం వెల్లడించింది.

Similar News

News November 23, 2025

అరుణాచలం వెళ్లే భక్తులకు పాలమూరు డిపో శుభవార్త

image

మహబూబ్ నగర్ జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల ప్రదక్షణకు వెళ్లే భక్తులకు డిపో మేనేజర్ సుజాత శుభవార్త తెలిపారు. డిసెంబర్ 3న బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్యాకేజీ రూ.3600 ఉంటుందన్నారు. https://tsrtconline.in బుక్ చేసుకోవాలని తెలిపారు. 9441162588 నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.

News November 23, 2025

రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.

News November 23, 2025

జీపీవోల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా శ్రీనివాస్

image

గ్రామ పాలనాధికారుల(జీపీవో) సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా జనగామకు చెందిన పెండెల శ్రీనివాస్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించిన ఆ సంఘం రాష్ట్ర నాయకత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. జీపీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.