News January 1, 2025
ప్రజలకు అందుబాటులో ఉండండి.. MLAలకు సీఎం సూచన
TG: స్థానిక సంస్థల్లో సమన్వయంతో పని చేసి గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి తనను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ‘నేను మారాను. మీరూ మారండి. స్థానిక ఎన్నికలు చాలా కీలకం. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నా దగ్గర సమాచారం ఉంది. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు ఉన్నాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉండండి’ అని సూచించారు.
Similar News
News January 4, 2025
కోహ్లీది అదే కథ!
‘KOHLI LOVES SLIPS’ అన్న ట్రోల్స్ నిజం చేస్తూ BGT చివరి ఇన్నింగ్స్‌లోనూ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔట్ అయ్యారు. ఈ సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 8సార్లు కోహ్లీ ఇలాగే పెవిలియన్‌కు చేరడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకేలా ఔట్ అవుతున్నా ఆటశైలి మారకపోవడంతో రిటైర్ అవ్వాలనే డిమాండ్ విన్పిస్తోంది. కెరీర్ చివర్లో ఉన్న విరాట్ టెక్నిక్ మార్చుకోకపోతే టీంలో చోటు కోల్పోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
News January 4, 2025
ఏపీలో షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు: YCP
APలో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయంటూ వైసీపీ ట్వీట్ చేసింది. స్మార్ట్ మీటర్ల బిగింపు తర్వాత నెల రోజుల వ్యవధిలోనే వందల నుంచి వేలాది రూపాయలకు బిల్లులు పెరిగిపోయాయని ఆరోపించింది. నెల్లూరు జిల్లాలో ఓ చిరుద్యోగి ఇంటికి రూ.39,525 బిల్లు వచ్చిందని ఓ ఫొటోను పంచుకుంది. బిల్లుల బాదుడే.. బాదుడు రూపంలో పేదలకు న్యూఇయర్ కానుక ఇస్తున్నావా? అని సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసింది.
News January 4, 2025
కాసేపట్లో కోర్టుకు అల్లు అర్జున్
TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. జడ్జి ముందు బన్నీ బెయిల్ పూచీకత్తు పత్రాలను సమర్పించనున్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులపై నిన్న బన్నీకి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.