News January 10, 2025
జాగ్రత్త బాసూ.. సంక్రాంతికి ఊరెళ్తున్నావా?

సంక్రాంతికి ఊరెళ్లేవారు పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకూడదు. బీరువా తాళాలు, నగదు, నగలు బ్యాంకులో భద్రపరుచుకోవాలి. ఇంటికి తాళం వేసినట్లు కనిపించకుండా కర్టెన్ తొడగాలి. CC కెమెరాలు బిగించుకోవాలి. ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దు. ఇంటి ముందు తెలిసినవారితో చెత్త శుభ్రం చేయించుకోవాలి. కొత్త వ్యక్తులు కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వాలి.
Similar News
News October 18, 2025
BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

తెలంగాణలో బీసీల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లతో రాజ్యమేలుతారనుకుంటే బంద్తో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టడం, హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే విధించడంతో తమ ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారని బీసీలు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ పరిణామానికి కారణమెవరు? Comment
News October 18, 2025
అత్యంత భారీగా తగ్గిన వెండి ధరలు

ధన త్రయోదశి వేళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండిపై ఏకంగా రూ.13వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,910 తగ్గి రూ.1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.
News October 18, 2025
దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

TG: దీపావళి పండుగకు 2 రోజుల ముందు వచ్చిన ‘రాష్ట్ర బంద్’ పండుగ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వారాంతం కూడా కావడంతో ప్రజలు దీపావళి షాపింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. వస్త్ర, గోల్డ్, స్వీట్స్ దుకాణదారులు ఇవాళ భారీ వ్యాపారాన్ని ఆశించారు. కానీ బీసీ సంఘాల బంద్ పిలుపుతో జనం రాక తగ్గి బిజినెస్పై ఎఫెక్ట్ పడుతుందని వారు ఆందోళనలో ఉన్నారు. బంద్ ప్రభావం ఎంతో సాయంత్రానికి క్లారిటీ వస్తుంది.