News January 16, 2025

3 రోజులు జాగ్రత్త

image

TGలో చలి తీవ్రత మరో మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొగమంచు ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో APలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Similar News

News February 16, 2026

శ్రీకాళహస్తిలో భక్తురాలు మృతి: YCP

image

AP: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తురాలు మృతిచెందినట్లు YCP ఆరోపించింది. శివరాత్రి రోజున శివయ్య దర్శనానికి వచ్చిన తిరుపతి(D) కొగిలగొల్లపాలెంకు చెందిన మణెమ్మ గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి అస్వస్థతకు గురైనట్లు చెప్పింది. సమాచారం ఇచ్చినా సకాలంలో 108 వెహికల్ రాలేదని, దీంతో ఆమె మృతిచెందినట్లు ట్వీట్ చేసింది. పండగ రోజు ఆలయాల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని, ఈ పాపం ప్రభుత్వానిదే అని మండిపడింది.

News February 16, 2026

గాలిలో బిల్‌గేట్స్ విమానం చక్కర్లు!

image

AP: బిల్‌గేట్స్ విమానం ల్యాండింగ్‌కు సమస్య తలెత్తింది. విజయవాడ విమానాశ్రయం వద్ద దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ల్యాండింగ్ సాధ్యపడట్లేదు. దీంతో ఫ్లైట్ విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతోంది. సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం కోసం పైలట్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బిల్‌గేట్స్ అమరావతిని సందర్శించాల్సి ఉంది.

News February 16, 2026

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం నుంచి రూ.564 కోట్లు!

image

TG: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బకాయిల విడుదలకు కేంద్రం ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఫండ్స్ విషయమై హౌసింగ్ అధికారులు ఢిల్లీ వెళ్లగా రూ.564 కోట్ల రిలీజ్‌కు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.45 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవ్వగా 60వేల పంపిణీ పూర్తయింది. మరో 30వేలు పంపిణీకి సిద్ధమవ్వగా మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. కేంద్రం నిధులు ఇస్తే నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశముంది.