News March 13, 2025

నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణ్ పేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.

Similar News

News March 13, 2025

₹2,100 చెల్లిస్తే ₹5,00,000.. నిజమిదే!

image

ప్రధానమంత్రి ముద్ర యోజనపై తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ₹2,100 చెల్లిస్తే ₹5,00,000 ఋణం మంజూరు చేస్తున్నట్లు ఓ నకిలీ ఆమోదిత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని పేర్కొంది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ముద్రా ఋణాలను సూక్ష్మ వ్యవస్థాపకులు/వ్యక్తులకు నేరుగా ఇవ్వదని తెలిపింది.

News March 13, 2025

మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ తెలిపింది మార్చి 18 నుంచి మే 22 లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయిస్తారు. 27న వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. apms.ap.gov.in

News March 13, 2025

కొత్త రేషన్ కార్డులపై UPDATE

image

TG: రేషన్ కార్డులను క్యూ ఆర్ కోడ్‌తో ఏటీఎం కార్డు సైజులో జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వాటితో పాటు పాత వాటికి Qr కోడ్ ఇవ్వనుంది. 1.20 కోట్ల కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. 760 మైక్రాన్స్ మందం, 85.4mm పొడవు, 54mm వెడల్పు ఉండే ఈ కార్డులపై నంబర్, కుటుంబ పెద్ద పేరు, ఫొటో, ఇతర వివరాలు ఉంటాయి. నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.

error: Content is protected !!