News May 25, 2024

రానున్న 3 రోజులు జాగ్రత్త

image

TG: వర్షాలతో ఇటీవల చల్లబడిన రాష్ట్రంలో ఎండలు మళ్లీ మండిపోతున్నాయి. నిన్న చాలా జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 44.9, హాజీపూర్‌లో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News

News November 29, 2025

సివిల్స్ ప్రిపరేషన్.. నార్నూర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

image

నార్నూర్ గ్రామ పంచాయతీ రాజకీయాల్లో నూతన ఒరవడి ప్రారంభమైంది. అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి, సివిల్స్ కోసం సిద్ధమవుతున్న ఉన్నత విద్యావంతురాలు బాణోత్ కావేరి సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె బరిలో దిగుతున్నారు. మాజీ సర్పంచ్ బాణోత్ గజానంద్ నాయక్ కుమార్తె అయిన కావేరి, గ్రామస్థులతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

News November 29, 2025

గోవాడలో దాన్యం కొనుగోలు పరిశీలించిన కలెక్టర్.!

image

అమర్తలూరు మండలం గోవాడలోని రైతుసేవా కేంద్రంలో దాన్యం కొనుగోలు ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. దళారుల మాటలు విని ధాన్యాన్ని తక్కువ రేటుకి అమ్ముకోవద్దని అన్నారు. రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News November 29, 2025

ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూమ్: జేసీ

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే 8121676653, 18004251291 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.