News November 16, 2024
ఈ దేశాల నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్రత్త!

Southeast Asia నుంచి, ముఖ్యంగా కంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్రత్తపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2022 నుంచి ఈ దేశాలకు వెళ్లిన వారిలో 30 వేల మంది భారతీయుల ఆచూకీ లభించకపోవడం కలకలం రేపుతోంది. ఉద్యోగాల పేరుతో రప్పించి వీరితో బలవంతంగా సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై విచారణకు భారత ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.
Similar News
News January 27, 2026
భారత్‌తో డీల్‌కు కెనడా ఆసక్తి!

భారత్‌తో బిజినెస్ డీల్‌కు కెనడా కూడా ఆసక్తి చూపుతోంది. ఈ ఏడాది మార్చిలో ఆ దేశ PM కార్నే భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కీలక ఒప్పందాలపై సైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌తో యూరోపియన్ యూనియన్ బిగ్ డీల్ చేసుకుంది. దీనిపై ఇవాళ ప్రధాని మోదీ, ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ప్రకటన చేయనున్నారు. మనదేశంపై భారీగా టారిఫ్స్ వేసిన ట్రంప్‌కు ఈ డీల్స్‌తో సమాధానం చెప్పే అవకాశం లభించింది.
News January 27, 2026
భారత్-ఈయూ ఒప్పందంపై అమెరికా అక్కసు

ఇండియా-యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్రాత్మక<<18969639>> ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్<<>> (FTA) ఖరారు కావడంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. EU కంటే తామే ఎక్కువ త్యాగాలు చేశామని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించామని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గొప్పలు చెప్పుకున్నారు. ఉక్రెయిన్ కోసం తాము రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై టారిఫ్‌లు విధిస్తే, EU మాత్రం ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు.
News January 27, 2026
హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు.. నటిపై క్రిమినల్ కేసులు!

లాస్ఏంజెలిస్(US)లోని హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు వేలాడదీసి నటి సిడ్నీ స్వీనీ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా బోర్డుపైకి ఎక్కి బ్రాలను దండగా కట్టి వేలాడదీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రచారం కోసం చేసిన స్టంట్ స్వీనీకి సమస్యలు తెచ్చిపెట్టింది.


