News January 3, 2025

రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రివేళ సాధారణం కంటే 2-4 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై, శీతల గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Similar News

News January 29, 2026

ఒట్రోవర్ట్ గురించి తెలుసా?

image

ఇంట్రోవర్ట్, ఎక్స్​ట్రోవర్ట్, ఆంబ్రివర్ట్ అనే పదాలు వ్యక్తిత్వాన్ని సూచించేందుకు వాడతారు. అయితే ఒట్రోవర్ట్ లక్షణాలున్నవారు ఇంట్రోవర్ట్స్, ఎక్స్​ట్రోవర్ట్స్​ కలిపి పరిస్థితులకు తగ్గట్లు మారిపోతూ ఉంటారు. వీరు ప్రత్యేకమైన సంబంధ శైలిని కలిగి ఉంటారంటున్నారు నిపుణులు. ఇంట్రోవర్ట్, ఎక్స్​ట్రోవర్ట్ మధ్య స్పష్టమైన మూడ్ స్వింగ్‌లను అనుభవించే వ్యక్తులను వివరించడానికి ఒట్రోవర్ట్ పదాన్ని ఉపయోగిస్తున్నారు.

News January 29, 2026

కేసీఆర్‌కు మూడోసారి నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ CM KCRకు పోలీసులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది. గతంలోనూ ఆయనకు వేర్వేరు ఇష్యూల్లో నోటీసులు అందాయి. INC అధికారంలోకి వచ్చిన తర్వాత PPAలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. దానిపై KCR హైకోర్టుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కూలడంపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషనూ నోటీసులిచ్చింది. KCR ఆ కమిషన్ ముందు హాజరయ్యారు.

News January 29, 2026

యాసంగి ఆముదం పంటలో పురుగుల కట్టడికి సూచనలు

image

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంటలో వివిధ పురుగుల తీవ్రత పెరిగింది. రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2ML లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటను లద్దె పురుగు ఆశిస్తే లీటరు నీటికి నొవాల్యురాన్ 1ML కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ML కలిపి పిచికారీ చేయాలి.