News September 21, 2024

కోర్టు తీర్పులపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త: SC

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో BRS MLC కవితకు బెయిల్ రావడంపై CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి స్పందించింది. రేవంత్ తన వ్యాఖ్యలపై ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పడంతో ఈ విషయంలో ఇంకా ముందుకెళ్లాలని తాము అనుకోవట్లేదని పేర్కొంది. కోర్టులు జారీ చేసిన ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Similar News

News October 20, 2025

మన ఆచారాల వెనుక దాగున్న సైన్స్

image

మన సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాదు! ఆరోగ్య, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన పెద్దలు చెప్పులు ఇంటి బయటే వదలమంటారు. బయటకు వెళ్లి రాగానే కాళ్లూచేతులు కడగమంటారు. పుడితే పురుడని, మరణిస్తే అంటు అని అందరికీ దూరంగా ఉండాలంటారు. సెలూన్‌కి వెళ్తే స్నానం చేయనిదే ఇంట్లోకి రానివ్వరు. మహిళలు స్నానం చేయనిదే వండొద్దని అంటారు. వీటికి కారణం క్రిములను ఇంట్లోకి రాకుండా నిరోధించడమే.

News October 20, 2025

ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి: చిరంజీవి

image

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. ప్రేమ, నవ్వు, కలిసి ఉండటం వల్ల జీవితం వెలిగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తాయి’ అని ట్వీట్ చేశారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో హీరోయిన్‌గా నయనతార, స్పెషల్ రోల్‌లో వెంకీ మామ కనిపించనున్నారు.

News October 20, 2025

రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.