News October 15, 2024

మార్కెటింగ్ కంటెంట్లో AIతో జాగ్రత్త.. లేదంటే!

image

AI‌తో లాభాలున్నా సరైన పర్యవేక్షణ లేకుంటే జరిగే నష్టం అపారం. వెస్ట్రన్ కల్చర్, లాంగ్వేజెస్ వరకు పర్లేదు గానీ భారతీయ భాషలు, కల్చర్‌పై అవగాహన లేకుంటే దెబ్బ తప్పదు. ‘ఐపిల్ గర్భనిరోధక మాత్ర నిన్ను మిస్సవుతోంది పల్లవీ’ అంటూ జెప్టో పంపిన నోటిఫికేషన్ దీనినే తెలియజేస్తోంది. ఇలాంటి కంటెంట్ ఇస్తున్నప్పుడు మానవ పర్యవేక్షణ కంపల్సరీ అంటున్నారు నిపుణులు. గుడ్డిగా AIని నమ్మొద్దంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?

Similar News

News January 26, 2026

దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

image

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.

News January 26, 2026

టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్!

image

గాయపడ్డ భారత క్రికెటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో ఐదో టీ20 సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సిరీస్‌లో ఆడే అవకాశం లేదని తెలిపాయి. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో WC వార్మప్ మ్యాచుకు జట్టులో చేరుతారని వెల్లడించాయి. కాగా వరల్డ్‌కప్ ముందు తిలక్ ఫిట్‌నెస్ సాధించడంతో భారత్‌కు ప్రయోజనం చేకూరనుంది. ఆయన చేరికతో జట్టు మరింత పటిష్ఠంగా మారనుంది.

News January 26, 2026

కార్లపై భారీగా టారిఫ్‌లను తగ్గించనున్న భారత్

image

భారత్, EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల్లో భాగంగా యూరోపియన్ కార్లపై ఉన్న 110 శాతం దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. తొలుత 15,000 యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై పన్ను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. క్రమంగా ఈ టారిఫ్‌లను 10 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, BMW వంటి కంపెనీలకు భారత మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.