News November 17, 2024
అతనితో జాగ్రత్త.. ఆసీస్ ప్లేయర్లకు మెక్‌గ్రాత్ సూచన

భారత స్టార్ ప్లేయర్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాజీ ప్లేయర్ గ్లెన్ మెక్ గ్రాత్ సలహా ఇచ్చారు. బిగ్ గేమ్స్ అంటే కోహ్లీ చెలరేగుతాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైనా అతడిని తక్కువ అంచనా వేయొద్దన్నారు. అతడి జోలికి వెళ్లకుండా ఉంటే ఆసీస్‌కే మేలని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 19, 2025
డ్రంకన్ డ్రైవ్‌లో ఇద్దరికి 7 రోజుల జైలు: SP

బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు నిందితులకు 7 రోజుల జైలు శిక్ష విధించారు. కొర్లాం గ్రామానికి చెందిన బి.హేమంత్, విజయనగరం పట్టణానికి చెందిన అడపాక సాయిలను నవంబర్ 18న నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కేసును విచారించిన గజపతినగరం మెజిస్ట్రేట్ విజయ్ రాజ్ కుమార్ ఇద్దరికీ జైలు శిక్షను విధించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.
News November 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 19, 2025
ఇండియా ఘన విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు రెండో విజయం సాధించింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135-7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఓపెనర్లు వైభవ్(12), ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపరిచినా, హర్ష్ దూబే(53*), నమన్ ధిర్(30) రాణించారు. దీంతో ఇండియా-ఏ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.


