News June 17, 2024

ఇన్‌స్టా, టెలిగ్రామ్ ఛానల్స్‌తో జాగ్రత్త: NSE

image

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై టిప్స్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో వచ్చే ఛానల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని NSE హెచ్చరించింది. “ఇన్‌స్టాలో ‘bse_nse_latest’, టెలిగ్రామ్‌లోని ‘భారత్ ట్రేడింగ్ యాత్ర’, ‘VR టెక్నికల్స్’ హ్యాండిళ్లకు దూరంగా ఉండండి. ‘డా.స్టాక్ మార్కెట్ కంపెనీ’ అనే గ్రూప్‌ను ఫాలో కావొద్దు. పెట్టుబడుల పేరుతో వీరు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు సేకరిస్తున్నారు” అని పేర్కొంది.

Similar News

News April 2, 2026

క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ గుడ్‌బై

image

సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్‌డెర్ డసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రొటీస్ బోర్డుకు, సహచర ఆటగాళ్లకు, అండగా నిలిచిన కోచ్‌లు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 37 ఏళ్ల డసెన్ SA తరఫున 71 వన్డేల్లో 2,657 పరుగులు, 57 టీ20ల్లో 1,406, 18 టెస్టుల్లో 905 రన్స్ చేశారు. 2022 IPLలో RR తరఫున, SA లీగ్‌లో MI కేప్‌టౌన్‌ తరఫున ఆడారు.

News April 2, 2026

నా భూమి లాక్కున్నారు.. నటి సోనాలిపై రైతు కేసు!

image

సీనియర్ నటి సోనాలీ బింద్రే, ఆమె భర్త గోల్డి బెహల్ తన 30 గుంటల భూమిని ఆక్రమించారంటూ పుణేకు చెందిన రైతు చంద్రకాంత్ పోలీసులను ఆశ్రయించారు. ఆ భూమి 1957 నుంచే వంశపారంపర్యంగా వస్తోందని, తనను బెదిరించి ఆక్రమించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే తాను చట్టబద్ధంగానే ఆ భూమిని కొనుగోలు చేశానని సోనాలి చెబుతున్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని, కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు.

News April 2, 2026

గుండెల మీద ఆడించిన తండ్రే.. కర్కశంగా చంపేశాడు!

image

AP: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఉంటానని కూతురు చెప్పడాన్ని తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆమె గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేసి, ఆపై ఉరేసి చంపాడు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి(22), అదే మండలానికి చెందిన నాగరాజు గత నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే మాట్లాడుకుందామని పెద్దలు వారిని మాచర్ల తీసుకురాగా 18న హత్య జరిగింది. పోలీసులు నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.