News April 27, 2024

ఆర్టీసీ సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించండి: ఎండీ సజ్జనార్

image

TG: విధుల్లో ఉన్న TSRTC సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరం అని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ‘సిబ్బందిపై దాడులను సంస్థ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులకు IPC 353 సెక్షన్ ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పోలీస్ శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచి వసూలు చేస్తాం. RTC సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించండి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 21, 2025

ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

image

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

News November 21, 2025

మిస్‌ యూనివర్స్‌-2025 ఫాతిమా బాష్‌ గురించి తెలుసా?

image

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో “ఫాతిమా బాష్” విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేశారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడిన ఆమె వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 121 దేశాల అందగత్తెలను దాటి మిస్ యూనివర్స్‌గా నిలిచారు.

News November 21, 2025

పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఇదే: వైద్యులు

image

పిల్లల్ని కనడానికి ఏ వయసు ఉత్తమమో వైద్యులు సూచించారు. ‘ఆరోగ్యకరమైన గర్భధారణ, బిడ్డ కోసం స్త్రీల ఏజ్ 20-30 మధ్య ఉండాలి. 35 తర్వాత గర్భధారణ డౌన్ సిండ్రోమ్, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు పెరుగుతాయి. పురుషులకు 25-35 ఏళ్లు ఉత్తమం. 40ఏళ్ల తర్వాత పుట్టేబిడ్డల్లో ఆటిజం, జన్యు సమస్యల ప్రమాదం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఏజ్ 35 కంటే తక్కువ ఉన్నప్పుడే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి’ అని చెబుతున్నారు.