News April 21, 2025
BE READY: రేపు మ.12 గంటలకు..

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు మ.12 గం.కు విడుదల కాబోతున్నాయి. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. Way2News యాప్ ద్వారా ఎలాంటి యాడ్స్ లేకుండా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. మార్క్స్ లిస్టును ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేయొచ్చు.
*విద్యార్థులకు Way2News తరఫున BEST OF LUCK
Similar News
News August 7, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: కర్ణాటక నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
News August 7, 2025
‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు?

TG: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు తర్వాతే ఎలక్షన్స్‌కు వెళ్తామని CM రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. కానీ ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడమే INC ముందున్న అవకాశం. మరి రేవంత్ త్వరలోనే ఆ దిశగా ఎన్నికలకు వెళ్తారా? లేక కేంద్రం స్పందన కోసం ఇంకా వేచి చూస్తారా? అనేది తేలాలి. అటు గ్రామాల్లో పాలకవర్గాల కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
News August 7, 2025
రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

TG: హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో శుక్రవారం స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించినా, చాలా స్కూళ్లు సెలవు ఇవ్వలేదు. పబ్లిక్ హాలిడే ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు?