News September 21, 2024
జనవరిలో బీచ్ ఫెస్టివల్: దుర్గేశ్

AP: YCP ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, గాడిలో పెట్టడానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. కాకినాడలో NTR బీచ్‌ను ఆయన పరిశీలించారు. ‘YCP ప్రభుత్వం నిలిపివేసిన బీచ్ ఫెస్టివల్‌ను పునరుద్ధరిస్తాం. జనవరిలో నిర్వహిస్తాం. అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్కును పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి చేస్తాం’ అని దుర్గేశ్ వెల్లడించారు.
Similar News
News January 21, 2026
లిక్కర్ స్కామ్ కేసు.. ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ తిరస్కరణ

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ తిరస్కరించింది. దాని కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ ముగ్గురు నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్‌పై ఉన్నారని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టేసేంత వరకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఉంటుందని కోర్టు వెల్లడించింది.
News January 21, 2026
దావోస్ మీట్.. చిరు సడన్ ఎంట్రీకి కారణమిదే?

TG: పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్(Swiz)లో CM రేవంత్ హాజరైన సదస్సులో మెగాస్టార్ చిరంజీవి సడన్‌గా ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు ఫ్యామిలీ వెకేషన్ మీద స్విట్జర్లాండ్ వెళ్లారని తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి ఆయన హాజరైనట్లు సమాచారం. కాగా మెగాస్టార్ తిరిగి రాగానే MSVPG గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించనున్నారని సినీ వర్గాలు తెలిపాయి.
News January 21, 2026
వరుస షూటింగ్స్‌తో స్పీడ్ పెంచనున్న ప్రభాస్!

డార్లింగ్ ప్రభాస్ కాస్త బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీగా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన ఇటలీ టూర్‌లో ఉండగా వీకెండ్‌లో ఇండియాకు రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. రాగానే ‘ఫౌజీ’ కొత్త షెడ్యూల్‌లో పాల్గొని అనంతరం ‘కల్కి-2’ షూటింగ్‌లో జాయిన్ అవుతారని పేర్కొన్నాయి. త్వరలో ఈ సినిమాల విడుదల తేదీలపై స్పష్టత వస్తుందన్నాయి. వీటి తర్వాత ‘స్పిరిట్’ తిరిగి పట్టాలెక్కుతుందని వెల్లడించాయి.


