News August 21, 2025
SEP 26,27,28 తేదీల్లో సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్

AP: బాపట్ల (D) సూర్యలంక బీచ్‌లో SEP 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా 3రోజుల పాటు సాంస్కృతిక, క్రీడా, వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27న CM చంద్రబాబు సూర్యలంక బీచ్‌లో పర్యటించనున్నారు. అదే రోజు రూ.97 కోట్లతో బీచ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ జె.వెంకట మురళీ సమీక్ష నిర్వహించారు.
Similar News
News August 21, 2025
నివేదిక రద్దు చేయాలని పిటిషన్లు.. విచారణ వాయిదా

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలన్న <<17470256>>కేసీఆర్<<>>, హరీశ్ రావు పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ కోరగా, విచారణ రేపటికి వాయిదా పడింది.
News August 21, 2025
కలిసి వచ్చే పార్టీలతో ఉక్కుపై పోరాటం చేస్తాం: బొత్స

AP: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని YCP నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోందని, కేంద్ర ప్రభుత్వ సాయం తప్ప రైతులకు రాష్ట్ర సర్కారు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కుపై కలిసొచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని తెలిపారు.
News August 21, 2025
BREAKING: చంద్రబాబు వార్నింగ్

AP: మంత్రులు, MLAలకు CM చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తప్పు చేసింది ఎవరైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు అలసత్వం చూపిస్తున్నారని, ఎవరు ఎంత టైం తీసుకుంటున్నారో లెక్కలు తన వద్ద ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.