News August 2, 2024
బేర్ పంజా.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 800కుపైగా పాయింట్లు కోల్పోయి 81,059కు చేరగా, నిఫ్టీ 270 పాయింట్ల నష్టంతో 24,741 వద్ద ట్రేడవుతోంది. ఆటో, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, మెటల్ రంగాల షేర్లు నష్టాలను నమోదు చేయడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, టాటా స్టీల్ 3%కుపైగా నష్టపోగా.. JSW స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్ 2%కుపైగా లాస్ అయ్యాయి.
Similar News
News December 5, 2025
వరంగల్, హనుమకొండ కలయికపై చర్చ ఉంటుందా?

నర్సంపేట పర్యటనలో CM రేవంత్ రెడ్డి హనుమకొండ-వరంగల్ జిల్లాల కలయికపై స్పందిస్తారా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. రెండు జిల్లాలను గ్రేటర్ పరిధిలో సమన్వయంగా అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేయగా.. ఆ మధ్య కాలంలో కలయిక ఉంటుందని భావించారు. సదుపాయాలు, రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ సేవలను ఒకే వ్యూహంతో ముందుకు తీసుకెళ్లడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని CM చెప్పొచ్చని రాజకీయ వర్గాల అంచనా.
News December 5, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ/కెమికల్ /కంప్యూటేషనల్ & ఇన్ఫర్మేషన్ /ఫార్మాస్యూటికల్/వెటర్నరీ విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nii.res.in
News December 5, 2025
అందుకే IPLకు గుడ్‌బై చెప్పా: ఆండ్రీ రస్సెల్

వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ IPLకు <<18429844>>గుడ్‌బై<<>> చెప్పిన కారణాన్ని తాజాగా వెల్లడించారు. “ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద టోర్నీ. ప్రయాణాలు, వరుస మ్యాచ్‌లు, ప్రాక్టీస్, జిమ్ వర్క్‌లోడ్ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం సవాలుతో కూడుకున్నది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ నేను ప్రభావం చూపాలి. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగాలని అనుకోవడం లేదు” అని తెలిపారు.


