News July 22, 2024
కమలా హారిస్‌ని ఓడించడం ఈజీ: ట్రంప్

US అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బైడెన్ కంటే కమలా హారిస్‌ను ఎన్నికల్లో ఓడించడం మరింత సులువని భావిస్తున్నట్లు స్థానిక మీడియాతో తెలిపారు. మరోవైపు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు కూడా అర్హుడు కాదని విమర్శించారు.
Similar News
News January 20, 2026
పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు: హైకోర్టు

TG: చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని, బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం లాంటివి చేయొద్దని పోలీసులను ఆదేశించింది. వాహనదారుడు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని సూచించింది. లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
News January 20, 2026
ప్రజల దృష్టి మళ్లించేందుకు CM ఎత్తులు: లక్ష్మణ్

TG: ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న బాధ్యులు ఎవరో తేల్చకుండా CM రేవంత్ రెండేళ్లుగా దర్యాప్తు పేరిట కాలయాపన చేశారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. ‘ప్రజల దృష్టి మళ్లించడానికి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాపింగ్‌పై కవిత చేసిన ఆరోపణలకు BRS సమాధానం చెప్పాలి’ అని ఢిల్లీలో ఆయన పేర్కొన్నారు. కలహాలతో BRS ముక్కలవుతుందని జోస్యం చెప్పారు.
News January 20, 2026
MSVPG హిట్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

MSVPG హిట్ కావడంతో ప్రేక్షకులను ఉద్దేశించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మూవీపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణతో నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. మీరు లేనిదే నేను లేను. ఈ విజయం తెలుగు ప్రేక్షకులది. స్క్రీన్‌పై నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై చూపించే ప్రేమ శాశ్వతం. మూవీ టీంకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.


