News September 11, 2025

మగువల కోసం బ్యూటీ టిప్స్

image

* యాపిల్ సైడర్ వెనిగర్‌ కలిపిన నీటిలో పాదాలను 30 నిమిషాలు ఉంచితే పాదాల దుర్వాసన, పగుళ్లు, మడమ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
* 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో కాస్త నీటిని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను మెడపై అప్లై చేసి 5 నిమిషాల తర్వాత తడి వేళ్లతో స్క్రబ్ చేసి నీటితో కడిగితే మెడపై డార్క్ ట్యాన్ పోతుంది.
* ఐస్ క్యూబ్స్‌తో ముఖంపై రబ్ చేస్తే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.

Similar News

News September 11, 2025

నా కుమారుడు YSR వారసుడే: షర్మిల

image

AP: YCP, జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘నా బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే YCP ఇంతలా రియాక్ట్ అవుతోందంటే భయమా? నా కుమారుడికి రాజారెడ్డి అనే పేరు YSR పెట్టారు. ఎవరెన్ని వాగినా నా కొడుకు ఆయన వారసుడే. జగన్‌కు అసలు ఐడియాలజీ ఉందా? YSR బతికి ఉండి ఉంటే మీరు చేసిన పనికి తలదించుకునేవారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News September 11, 2025

గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు TGPSC..!

image

TG: <<17655670>>గ్రూప్-1<<>> మెయిన్స్ ఫలితాల రద్దు తీర్పుపై అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఈ అంశంపై కమిషన్ ఇవాళ సమావేశమైంది. బెంచ్ తీర్పును సవాల్ చేసేందుకు లీగల్ టీమ్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తోంది. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నట్లు TGPSC వర్గాలు తెలిపాయి.

News September 11, 2025

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.