News April 24, 2024
డ్యుయల్ సిటిజన్‌షిప్పే ఎందుకంటే? – 3/3

ఇందుకు ఊరటగా సరెండర్ సర్టిఫికెట్ స్థానంలో రివొకేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని ఈనెల 4న కేంద్రం కొత్త మెమోరాండం తీసుకొచ్చింది. కానీ దీనిపై సంతృప్తి చెందని కొందరు, డ్యుయల్ సిటిజన్‌షిప్పే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటున్నారు. OCI ఉన్నా సాగు భూముల కొనుగోలుకు, ఓటు వేసేందుకు హక్కు లేకపోవడం సహా విదేశాల్లో ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. <<-se>>#Elections2024<<>>
Similar News
News April 3, 2026
మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది గుర్తింపు: రేవంత్

TG గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో <<19551715>>సుప్రీంకోర్టు<<>> ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు. రాష్ట్ర పునర్నిర్మాణంలో గ్రూప్-1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థను ప్రక్షాళన చేసి నియామకాలను పూర్తి చేసిన TGPSC ఛైర్మన్, సిబ్బందికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
News April 3, 2026
హార్ముజ్ To ఇండియా.. షిప్‌కు ఎంత టైమ్ పడుతుంది?

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్‌ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.
News April 3, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.


