News August 16, 2024
EOS-08 శాటిలైట్ ప్రయోగం ఎందుకంటే?

SSLV-D3 రాకెట్ ద్వారా EOS-08 శాటిలైట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. దీని బరువు 175KGలు. ఇందులో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ, యూవీడోసిమీటర్ అనే 3 పేలోడ్లను అమర్చారు. సముద్రాలపై గాలులు, తేమ, హిమాలయాల్లో క్రియోస్పియర్, అగ్నిపర్వత పేలుళ్లు, పారిశ్రామిక విపత్తులు, వరదలను గుర్తించి ఫొటోలను తీసి పంపడం ఈ ప్రయోగ లక్ష్యం. ఈ మిషన్ ఏడాదిపాటు సేవలందిస్తుంది.
Similar News
News December 29, 2025
అమరావతిలో హైస్పీడ్, ట్రాఫిక్ ఫ్రీ రోడ్లు

AP: రాజధాని అమరావతిలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ట్రాఫిక్ జామ్‌కు తావులేకుండా విశాలమైన రహదారుల నిర్మాణం ఊపందుకుంది. 50-60 మీటర్ల వెడల్పుతో హైస్పీడ్ రోడ్లను నిర్మిస్తున్నారు. E11, E13, E15 రహదారులను NH-16తో అనుసంధానం చేస్తున్నారు. 9 వరుసల సీడ్ యాక్సెస్ రోడ్డు(E-3) ద్వారా అమరావతికి సులభంగా చేరుకోవచ్చు. రోడ్ల కింద డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లైన్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
News December 29, 2025
రికార్డు సృష్టించిన కోనేరు హంపి

ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో కలిపి మొత్తం 5 వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ మెడల్స్ గెలిచిన మొదటి మహిళగా హంపి రికార్డు సృష్టించారు. 15 ఏళ్ల వయసులోనే చదరంగంలో గ్రాండ్ మాస్టర్ అయిన హంపి.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నో ఘనతలు సాధించారు.
News December 29, 2025
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతుల మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన (25), ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన (24) ప్రాణాలు వదిలారు. వీరు MS పూర్తి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


