News September 2, 2024
ఎందుకీ అతివృష్టి, అనావృష్టి

జనాభా పెరగడం, చెట్ల నరికివేత, చెరువులు, నాలాలు ఆక్రమించి ఇళ్లు కట్టడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింది. దీంతో అతివృష్టి లేదంటే అనావృష్టి సంభవిస్తున్నాయి. గతంలో వర్షం కురిస్తే నీరు భూమిలోకి ఇంకిపోయేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా తారు, సిమెంట్ రోడ్లు ఉండటంతో నీరు ఇంకట్లేదు. మరోవైపు చెరువులు సైతం ఆక్రమించడంతో వరదలు సంభవిస్తున్నాయి. ఇంకుడు గుంతల ఏర్పాటు, చెట్ల పెంపకంతో కొంతవరకు సమస్యలు అధిగమించవచ్చు.
Similar News
News October 31, 2025
PHOTO: సీఎం రేవంత్‌తో సల్మాన్ ఖాన్

TG CM రేవంత్‌తో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ భేటీ అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిండే మనవరాలి పెళ్లి సందర్భంగా నిన్న ముంబై వెళ్లిన రేవంత్‌తో సల్మాన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ నినాదానికి వరల్డ్ వైడ్‌గా ప్రచారం కల్పిస్తానని సల్మాన్ చెప్పినట్లు సమాచారం.
News October 31, 2025
ఐపీవోకు Groww

స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘గ్రో’ మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ NOV 4-7 మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. షేర్ల ధరలను రూ.95-100గా నిర్ణయించింది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ.1,060Cr విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 55.72 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, వాటాదార్లు విక్రయించనున్నారు. దీంతో రూ.6,632Cr సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తద్వారా సంస్థ విలువ రూ.61,700Crకు చేరొచ్చని అంచనా.
News October 31, 2025
కర్నూలు ప్రమాదం.. కార్గో క్యాబిన్లో రెండో డ్రైవర్ నిద్ర

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు 2వ డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్లో నిద్రపోయారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదన్నారు. బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామని, ఆ ప్రయత్నం వల్ల 27మంది బతికారని చెప్పారు. ఈ ఘటనలో 19మంది చనిపోయారు.


