News October 16, 2024
సముద్రం లేని తెలంగాణలో రాడార్ స్టేషన్ ఎందుకంటే?

సముద్రమే లేని తెలంగాణలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం వెనుక ఓ కారణం ఉంది. భారత్‌కు తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో నిత్యం నేవీ జలాంతర్గాములు ప్రయాణిస్తూ ఉంటాయి. వాటి కమ్యూనికేషన్‌కు 2 సముద్రాల మధ్య దాదాపు సమాన దూరంలో ఉన్న వికారాబాద్ అడవి సరైనదిగా నేవీ భావించినట్లు సమాచారం. భారత్‌లో ఇది రెండో రాడార్ స్టేషన్. మొదటిది తమిళనాడులోని తిరునల్వేలి వద్ద ఏర్పాటు చేశారు.
Similar News
News January 5, 2026
బెయిలా? జైలా? ఉమర్ ఖలీద్‌పై నేడే సుప్రీం తీర్పు

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదేళ్లుగా జైలులో ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. డిసెంబర్లో సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నిందితులు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తుండగా.. ఎటువంటి ఆధారాలు లేకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచడం అన్యాయమని నిందితుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.
News January 5, 2026
మదురో కోట మట్టిపాలైంది.. శాటిలైట్ పిక్స్ వైరల్!

వెనిజులా అధ్యక్షుడు మదురో చిక్కిన ‘ఫ్యూర్టే తియునా’ సైనిక స్థావరం US దాడుల్లో ధ్వంసమైనట్లు శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేస్తున్నాయి. డెల్టా ఫోర్స్ జరిపిన దాడిలో మదురో నివాసంతో పాటు, అక్కడి గోదాములు, రక్షణ వ్యవస్థలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కేవలం 30 నిమిషాల్లోనే అమెరికా బలగాలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాయి. బాంబు దాడుల ధాటికి భారీ భవనాలు కుప్పకూలి, వాహనాలు కాలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
News January 5, 2026
ఎండోమెట్రియోసిస్ ఉంటే పిల్లలు పుట్టరా?

మహిళల్లో ఎండోమెట్రియల్ లైనింగ్ మందంగా ఉంటే నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, నొప్పి, స్పాటింగ్ వంటివి ఉంటాయి. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీని తీవ్రతను బట్టి గర్భధారణ సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారిలో అబార్షన్, ప్రీటర్మ్ డెలివరీ వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ✍️ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.


