News September 21, 2024

వారి వల్లే ఈ దౌర్భాగ్య పరిస్థితి: మాధవీలత

image

TG: మతమార్పిడి చేసుకున్న నాయకులు పాలించడం వల్ల తిరుమలలో ఈ పరిస్థితి నెలకొందని బీజేపీ నేత మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ఘటన మాటల్లో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి అని అన్నారు. ప్రసాదంలో జంతు కొవ్వు ఉపయోగించడమంటే పాపాన్ని అంట కట్టుకోవడమేనన్నారు. ఈ విషయంలో నిజం తేలే వరకు వదలిపెట్టనని తేల్చి చెప్పారు.

Similar News

News December 4, 2025

మామిడిలో జింకు లోపం – లక్షణాలు

image

సాధారణంగా చౌడు నేలల్లోని మామిడి తోటల్లో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపముంటే ఆకులు చిన్నవిగా మారి సన్నబడి పైకి లేదా కిందకు ముడుచుకుపోతాయి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలే గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.

News December 4, 2025

భారీ జీతంతో ఉద్యోగాలు

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (<>THDC<<>>)లో 40 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BSc(ఇంజినీరింగ్), బీటెక్, BE, MBBS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, PWBDలకు ఫీజు లేదు. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.55వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: thdc.co.in

News December 4, 2025

తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

image

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.