News July 1, 2024
నేషనల్ డాక్టర్స్ డే.. ఈరోజే ఎందుకంటే?

పశ్చిమ బెంగాల్ రెండో సీఎం బిధాన్ చంద్ర రాయ్ ఒక ప్రముఖ వైద్యుడు. డాక్టర్‌గా, సీఎంగా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా బిధాన్ పుట్టిన రోజైన జులై 1ని భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించింది. అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఏడాది జులై 1న నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ, అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటుంటారు.
Similar News
News October 20, 2025
CDACలో 646 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC)కు చెందిన వివిధ కేంద్రాల్లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.cdac.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News October 20, 2025
VITMలో 12పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్& టెక్నలాజికల్ మ్యూజియం(VITM)లో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.885. మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://www.vismuseum.gov.in/
News October 20, 2025
తీరు మారని ట్రంప్.. భారత్‌కు మరోసారి వార్నింగ్

ట్రంప్ తీరు మారడం లేదు. తన పాలనను వ్యతిరేకిస్తూ <<18047118>>రోడ్డెక్కిన<<>> US ప్రజలను పట్టించుకోకుండా ఇతర దేశాల పంచాయితీల్లో వేలు పెడుతున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు భారత్‌పై భారీగా టారిఫ్స్ విధిస్తానని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘రష్యా నుంచి ఆయిల్ కొనబోమని PM మోదీ నాతో చెప్పారు. ఒకవేళ కొనసాగిస్తే భారీ టారిఫ్స్ తప్పవు’ అని హెచ్చరించారు. కాగా ట్రంప్‌తో అసలు మాట్లాడలేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.