News November 6, 2025
BECILలో ఉద్యోగాలు

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా(BECIL)9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటివరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.295, SC, ST, PWBDలకు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:
www.becil.com/Vacancies
Similar News
News November 6, 2025
సినిమా అప్డేట్స్

* సందీప్‌రెడ్డి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రంలో దగ్గుబాటి అభిరామ్ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం.
* అమన్ కౌశిక్ డైరెక్షన్‌లో విక్కీ కౌశల్ హీరోగా ‘మహావతార్’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పరశురాముని పాత్రలో నటిస్తోన్న విక్కీ.. నాన్ వెజ్ మానేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
* కల్కి-2లో హీరోయిన్ పాత్ర కోసం ఆలియా, సాయిపల్లవి, అనుష్క, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు తెరపైకి వచ్చాయి.
News November 6, 2025
బయోమాస్‌తో రైతులకు ఆదాయం, ఉపాధి: సారస్వత్

AP: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయుక్తమని AP గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ సారస్వత్ పేర్కొన్నారు. బయోమాస్‌లో ఏపీ నం.1గా ఉందన్నారు. రైతులకు ఆదాయంతో పాటు ఉపాధి మెరుగుపడుతుందని బోర్డు భేటీలో చెప్పారు. విశాఖ(D) పూడిమడక వద్ద ₹1.85 L కోట్లతో NGEL హైడ్రోజన్ హబ్‌ను నెలకొల్పుతోందని CS విజయానంద్ తెలిపారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారని చెప్పారు.
News November 6, 2025
జుట్టుకు రంగు వేస్తున్నారా?.. జాగ్రత్త!

పదేపదే హెయిర్ డై లేదా కలరింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని ముంబై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అభిషేక్ పిలానీ హెచ్చరించారు. ‘తరచుగా రంగులు వేయడం వల్ల జుట్టులోని కెరాటిన్ దెబ్బతిని పెళుసుగా మారడం, చివర్లు చిట్లడం జరుగుతుంది. అమోనియా, పెరాక్సైడ్ వంటి తీవ్రమైన రసాయనాలు జుట్టుకు శాశ్వత నష్టం కలిగిస్తాయి. జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు తీవ్రమవుతాయి’ అని పేర్కొన్నారు.


