News February 26, 2026

BELలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), సెంట్రల్ రీసెర్చ్ లాబోరేటరీ(ఘజియాబాద్)లో 10 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. PhD(AI, కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

Similar News

News March 2, 2026

ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా!

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 1948-1979 వరకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరానే కావడం విశేషం. ఇరాన్‌కు సైనిక, వ్యవసాయ, టెక్నాలజీ పరంగా హెల్ప్ చేసింది. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ పాలకులు అమెరికా-ఇజ్రాయెల్ ఒక్కటేనని, అది ‘లిటిల్ సైతాన్’ అని విమర్శించారు. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ న్యూక్లియర్ దేశంగా మారడం ఇజ్రాయెల్‌కు ఇష్టం లేదు. అందుకే ఈ గొడవలు.

News March 2, 2026

పెరుగు తింటున్నారా?

image

పెరుగు తింటే దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని చాలా మంది అపోహ పడతారు. అయితే అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు. అందులోని ప్రోబయాటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. పాల కంటే పెరుగు సులభంగా జీర్ణం అవుతుందని చెప్పారు. బయట లభించే పెరుగు కంటే ఇంట్లోనే తాజాగా చేసుకోవడం ఉత్తమం అని, ఫ్రిజ్‌లో ఉంచింది కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు మంచిదని సూచిస్తున్నారు.
Share It

News March 2, 2026

రష్యా చమురు వైపు మళ్లీ భారత్ చూపు

image

హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఆటంకం కలుగుతోంది. దీంతో రష్యా చమురు దిగుమతిపై భారత్ మళ్లీ దృష్టి సారించినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ‘తన జలాల్లో డాక్ చేసిన కార్గోషిప్‌లలోని రష్యా చమురు కొనుగోలుకు భారత్ ఆలోచన చేస్తోంది. ఈ ట్యాంకర్లలో 9.5M బ్యారెళ్ల చమురు ఉంది. భారత ఆయిల్ కంపెనీలు దీనిపై ప్రభుత్వంతో చర్చించాయి’ అని తెలిపింది. US ఒత్తిడితో రష్యా చమురు కొనుగోలును భారత్ తగ్గించడం తెలిసిందే.