News October 18, 2024
బినామీ చట్టం: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

కొన్ని రూల్స్ రాజ్యాంగబద్ధంగా లేవంటూ 2022లో బినామీ సవరణ చట్టంపై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును CJI చంద్రచూడ్, PS నరసింహ, మనోజ్ మిశ్రాల ప్రత్యేక ధర్మాసనం నేడు రికాల్ చేసింది. కేంద్రం, IT వేసిన రివ్యూ పిటిషన్‌ను స్వీకరించింది. ఒక రూల్‌ను సవాల్ చేసినప్పుడే దాని రాజ్యాంగబద్ధతను నిర్ణయించగలుగుతామని తెలిపింది. చట్టమే లేనప్పుడు చేసిన నేరానికి తర్వాత తెచ్చిన చట్టంతో శిక్షించడం కుదరదని 2022 తీర్పు సారాంశం.
Similar News
News November 20, 2025
IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <
News November 20, 2025
స్కాలర్షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

TG: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.
News November 20, 2025
అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

డాలర్‌కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్‌కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.


