News October 14, 2025
పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.
Similar News
News October 14, 2025
మోదీ టూర్.. కర్నూలులో 10 మంది మంత్రుల మకాం!

AP: ప్రధాని మోదీ కర్నూలు సభ విజయవంతం చేసేందుకు, జన సమీకరణకు 10 మంది మంత్రులు అక్కడే మకాం వేశారు. 16న జరిగే సభకు 7,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. PM పర్యటించే ప్రాంతాల్లో 200 CC కెమెరాలు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 16 వరకు డ్రోన్ల ఎగరవేతపై ఆయా ప్రాంతాల్లో నిషేధం విధించారు. ప్రధాని సభకు వెళ్లేవారి కోసం దాదాపు 8వేల బస్సులు సమకూరుస్తున్నట్లు సమాచారం.
News October 14, 2025
మీరు విన్న, కొన్న ది బెస్ట్ లోయెస్ట్ రేట్ ఏంటి?

బంగారం.. మున్ముందు ఈ పేరూ పలుకే బంగారమాయెనా అనేలా పచ్చ లోహం ధరలున్నాయి. ఇన్నాళ్లూ 24క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.1 లక్ష పైన కొనసాగగా ఇప్పుడు పన్నులతో కలిపి 18 క్యారెట్లూ ఒక లకారం దాటుతోంది. ఇప్పుడు సామాన్యుడు గోల్డ్ గురించి మాట్లాడుకోవడమే కానీ టైమ్ ట్రావెల్‌లో ధర తక్కువ ఉన్న గోల్డెన్ డేస్‌కు వెళ్లి కొనలేడు. మీరు ఎంత తక్కువ రేటుకు స్వర్ణం కొన్నారు. లేదా మీ వాళ్లు చెబుతుంటే విన్నారు? కామెంట్ చేయండి.
News October 14, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దీపావళి ముంగిట బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 3,280 పెరిగి రూ.1,28,680కు చేరింది. 10 రోజుల్లోనే రూ.9,280 పెరగడం గమనార్హం. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,000 పెరిగి రూ.1,17,950గా ఉంది. అలాగే కేజీ వెండిపై రూ.9,000 ఎగబాకి తొలిసారి రూ.2,06,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.