News September 10, 2025
వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.
Similar News
News September 10, 2025
భారత్ బౌలింగ్.. టీమ్ ఇదే

ASIA CUP-2025లో భాగంగా టీమ్ ఇండియా ఇవాళ UAEతో తొలి మ్యాచ్ ఆడుతోంది. భారత కెప్టెన్ సూర్య టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్య కుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
>SonyLIVలో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.
News September 10, 2025
PHOTO GALLERY: ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ-బీజేపీ-జనసేన అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించాయి. ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో జరిగిన ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. గత 15 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమం ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News September 10, 2025
AEE ఫలితాలు విడుదల

AP పొల్యూషన్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను APPSC విడుదల చేసింది. అభ్యర్థులు https://psc.ap.gov.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపింది. 2023లో 21 AEE పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నెలకు రూ.57,100-రూ.1,47,760 వరకు జీతం రానుంది.