News September 12, 2025

సాగులో విత్తనశుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు

image

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.

Similar News

News March 4, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అరియర్లపై గుడ్‌న్యూస్

image

AP: డీఏ అరియర్స్ బిల్లులను సమర్పించడంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు నెల రోజుల్లో ఆదేశాలిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు AP JAC అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. పెన్షనర్లు, CPS ఉద్యోగులకు ప్రభుత్వం 2018 జులై నుంచి DA అరియర్లు చెల్లించగా, పలు కారణాలతో చాలా మందికి అవి అందలేదు. దీంతో CFMSలో అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించే వెసులుబాటు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.

News March 4, 2026

డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, SPSR నెల్లూరులో ఉద్యోగాలు

image

<>డిస్ట్రిక్ <<>>లీగల్ సర్వీసెస్ అథారిటీ, SPSR నెల్లూరులో 7 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 16 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. క్రిమినల్ లా, లీగల్ రీసెర్చ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పని అనుభవం గలవారు అర్హులు. వెబ్‌సైట్: https://spsrnellore.dcourts.gov.in

News March 4, 2026

పంచాయతీల్లో ‘పంచాయితీ’!

image

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.