News June 8, 2024
బెంగాల్: భయంతో పార్టీ ఆఫీసుల్లో BJP కార్యకర్తలు

బెంగాల్‌లో BJP కార్యకర్తలపై దాడులు కలకలం రేపుతున్నాయి. TMC కార్యకర్తలు ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నట్లు BJP నేతలు వాపోతున్నారు. దాదాపు 10 వేల మంది BJP కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు పార్టీ ఆఫీసుల్లో తలదాచుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఎన్నికల్లో TMC 29, BJP 12 సీట్లలో నెగ్గాయి.
Similar News
News September 12, 2025
APPLY NOW: బీటెక్ అర్హతతో 976 ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి B.Arch, B.Tech/BE/MCA పూర్తిచేసి, GATEలో అర్హత సాధించి ఉండాలి. వయసు 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి మినహాయింపు ఉంటుంది. ఎంపికైన వారికి రూ.40వేలు-1.40 లక్షల జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు https://aai.aero/ వెబ్‌సైట్‌లో చూడగలరు.
#ShareIt
News September 12, 2025
అభివృద్ధి కోసమే PPP మోడల్స్: CM చంద్రబాబు

AP: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరముందని CM చంద్రబాబు Way2News Conclaveలో పేర్కొన్నారు. ‘అభివృద్ధి కోసమే PPP మోడల్స్ అనుసరిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇవే అమలవుతున్నాయి. దీంతో సంపద సృష్టి జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పథకాలు అమలు చేసే శక్తి వస్తుంది. అందుకే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్లం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం’ అని తెలిపారు.
News September 12, 2025
ట్రెండింగ్‌లో #Way2NewsConclave2025

ఇండియాలో తొలిసారిగా ఓ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ కాన్‌క్లేవ్ ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయవాడ కాన్‌క్లేవ్ గురించి చర్చిస్తూ పలువురు Xలో పోస్టులు పెడుతున్నారు. దీంతో Xలో #Way2NewsConclave2025 ట్రెండ్ అవుతోంది. వచ్చే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే కార్యాచరణను సీఎం చంద్రబాబు వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో వివరిస్తున్నారు.<<17688514>> లైవ్‌ను<<>> మీరూ వీక్షించండి.